తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాల‌పై, నాయ‌కుల‌పై వైసీపీ  కార్య‌క‌ర్త‌లు దాడి చేసిన విష‌యం విధిత‌మే.  దీంతో ఇరువురిపై కేసులు కూడ న‌మోద‌య్యాయి. అయితే తాజాగా బీజేపీ టీడీపీ కార్యాల‌యాల‌పై  వైసీపీ నేత‌లు దాడులు చేశార‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. దాడుల‌ను అడ్డుకోకుండా పోలీసులు సైతం ప్రేక్ష‌క‌పాత్ర‌ను వ‌హిస్తున్నార‌ని ఆరోపించింది బీజేపీ. వైసీపీ శ్రేణుల దాడి రాజ్య‌హింసేన‌ని.. ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

దీంతో టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు చేసి దాడి ప్రభావం  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌డే ప్ర‌మాదం పొంచి ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉపఎన్నిక స‌జావుగా, స్వేచ్ఛ‌గా, పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగేవిధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య‌కుమార్ నేతృత్వంలో బీజేపీ నేత‌ల బృందం తాజాగా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను క‌లిశారు. ఈ విష‌యంపై ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఎన్నిక‌ల ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మ‌రి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: