ఇటీవ‌ల కాలంలో గంజాయి ఓ సంచ‌ల‌నంగా మారింది. తాజాగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గంజాయి గురించి ప్ర‌క‌ట‌న చేశాడు. ఎంత‌టివారినైనా ఉపేక్షించేది లేద‌ని పేర్కొన్నాడు. అదేవిధంగా గంజాయి సాగు చేస్తే రైతుబంధు, రైతుబీమా వంటి ప‌థ‌కాలు కూడ ర‌ద్దు చేయ‌నున్న‌ట్టు సీఎం ప్ర‌క‌టించాడు. గంజాయి లాంటి మాద‌క ద్ర‌వ్యాల వ‌ల్ల యువ‌త మాన‌సిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంద‌ని, ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డే ఉంటుంద‌ని అధికారులు గంజాయి మాఫియాను అణ‌చివేయాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

ఇది అంతా ఒక ఎత్త‌యితే తాజాగా న‌ల్ల‌గొండ జిల్లాలో ఆర్టీసీ బ‌స్సులో గంజాయి ప‌ట్టివేత‌కు గురైంది. న‌ల్ల‌గొండ జిల్లా నార్క‌ట్‌ప‌ల్లి వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సులో త‌ర‌లిస్తున్న 8కిలోల గంజాయిని  స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై ఓ ఆర్టీసీ బ‌స్సుపై గంజాయి త‌ర‌లిస్తున్నార‌ని పోలీసుల‌కు స‌మాచారం అందింది. ఈ స‌మాచారం అందుకున్న నార్క‌ట్‌ప‌ల్లి పోలీసులు రంగంలోకి దిగి గంజాయితో పాటు ఓ వ్య‌క్తిని కూడ అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి మ‌హారాష్ట్రకు గంజాయిని త‌ర‌లిస్తున్న‌ట్టు నిందితుడు పోలీసుల‌కు వెల్ల‌డించాడు. ఇటీవ‌ల‌నే గంజాయిని క‌ట్ట‌డి చేసేందుకు న‌ల్ల‌గొండ పోలీసులు విశాఖ‌లో కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఇంత జ‌రుగుతున్నా గంజాయి ర‌వాణా మాత్రం ఆగ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: