విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటలను గిరిజనులు స్వయంగా ధ్వంసం చేసుకుంటున్నారు. విశాఖ ఏజెన్సీలోని జీకే వీధి మండలం దారకొండ, గుమ్మరేగుల పంచాయితీ గ్రామాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసుకున్నారు గిరిజనులు. చుట్టుపక్కల గ్రామాల గిరిజన ఆదివాసీలు చట్టానికి లోబడి ఉండాలన్న ఆలోచనతో, ఏకపక్ష నిర్ణయంతో, మనస్ఫూర్తి అంగీకారంతో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నామని గిరిజనులు వెల్లడిస్తున్నారు. గంచాయి వల్ల యువత చెడ్డదారులు వెతుకుతున్నారని, గంజాయి పంట కారణంగా గిరిజన ప్రజాలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. తాము చట్ట వ్యతిరేక పనులు చేయమని గిరిజన ఆదివాసీలు పోలీసులకు హామీ ఇస్తున్నారు. ఇందులో వరి ప్రమేయం లేదనీ, రాజకీయ ఒత్తిళ్లు లేవనీ వారు స్పష్టం చేశారు.

కాగా ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్‌ అంశం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ దుమారానికి దారితీస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి తోటలు సాగుచేసే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు గంజాయి తోటలను గిరిజనులు స్వయంగా ధ్వంసం చేసుకుంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: