హైదరాబాద్‌ కూకట్‌పల్లి కోర్టులో హీరోయిన్‌ సమత దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌ గురువారం విచారణకు రానుంది. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ, సీఎల్‌ వెంకట్రావులపై సమంత పిటిషన్‌ దాఖలు చేసింది. తన పరువును దెబ్బతీసే విధంగా పవర్తించిన మూడు యూట్యూబ్‌ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. తనపై ఎలాంటి వ్యాఖ్యలు, ప్రసారాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. సదరు యూట్యూబ్‌ ఛానెళ్లు తనకు క్షమాపణ చెప్పాలని, తనపై అసత్య ప్రసారాలు చేసిన యూట్యూబ్‌ లింక్స్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో విన్నవించుకుంది.

అంతేకాకుండా సోషల్‌ మీడియాలో, వెబ్‌సైట్స్‌లో, ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇంటర్నెట్‌లో తనపై ఉన్న అన్ని లింక్స్‌ను తొలగించాలని, వాటిపై శాశ్వత నిషేధాన్ని మంజూరు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని సమంత కోరింది. అలాగే వారి తరపున ఏజెంట్లు, సేవకులు, పరువు నష్టం, అపకీర్తిపాలు చేయడం, అపవాదులు మోపడం, వాటిని ప్రచురించడం, స్టేట్‌మెంట్స్‌ పోస్టులు, అప్‌డేట్స్‌ వీడియోలు, ఆడియోలు, కథనాలు వంటి వాటిని తనకు వ్యతిరేకంగా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించుకుంది. తన వ్యక్తిగత జీవితంలో ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలని కోరింది. ఈ మేరకు సమంత దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: