ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో పోలీస్ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు గురువారం నిర్వ‌హించారు. ముఖ్యఅతిథిగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. సీఎంకు హోంమంత్రి సుచ‌రిత‌, డీజీపీ గౌత‌మ్‌స‌వాంగ్‌లు స్వాగ‌తం ప‌లికారు.  పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. అనంత‌రం అమ‌ర‌వీరుల పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు సీఎం జ‌గ‌న్‌.

పోలీసులు అన్ని వేళ‌లో సేవ‌లు చేప‌డుతార‌ని.. వారి సేవ‌లు మ‌రువ‌లేనివి అని డీజీపీ ఇటీవ‌ల పేర్కొన్న విష‌యం విధిత‌మే. క‌రోనా స‌మ‌యంలో వారు అద్భుత‌మైన సేవ‌లు అందించార‌ని, అదేవిధంగా కొంత‌మంది క‌రోనాకు బ‌ల‌య్యారు. వారంద‌రికోసం రాష్ట్రవ్యాప్తంగా నివాళుల‌ర్పిస్తాం అని డీజీపీ ప్ర‌క‌టించారు. ఎక్క‌డ ఏ స‌మ‌స్య ఉన్న అక్క‌డ ముందు ఉండేది పోలీసులే. భార్య‌, పిల్ల‌ల‌ను వ‌దిలి ప్ర‌జ‌ల కోసం సేవ చేస్తూంటారు. అమరులైన పోలీస్ కుటుంబ స‌భ్య‌ల‌కు సీఎం జ‌గ‌న్ ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించారు. పోలీసులు చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: