తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంతోపాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాల‌యాలు, నేత‌ల‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు నిర‌స‌న దీక్ష ప్రారంభించారు. ఇది 36 గంట‌లు కొన‌సాగ‌నుంది. గురువారం ఉద‌యం ఎనిమిది గంట‌ల నుంచి శుక్ర‌వారం రాత్రి ఎనిమిది గంట‌ల వ‌ర‌కు చంద్ర‌బాబు దీక్ష చేయ‌నున్నారు. మంగ‌ళ‌గిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంలోని ప‌గిలిన అద్దాలు, ధ్వంస‌మైన సామ‌గ్రి మ‌ధ్యే ఆయ‌న దీక్ష చేప‌ట్ట‌నున్నారు. నిందితులు ఎవ‌ర‌నేది స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంద‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకునేంత‌వ‌ర‌కు పోరాటం ఆపేది లేద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబునాయుడు దీక్ష చేస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌గిరికి భారీగా చేరుకున్నారు. రాష్ట్ర అధ్య‌క్షుడ అచ్చెన్నాయుడుతోపాటు ఇత‌ర నేత‌లంతా త‌ర‌లివ‌చ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ఏపీలో తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వాడ‌కు చెందిన వైకాపా నేత‌ల ప్ర‌మేయం ఇందులో ఉంద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp