విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో పోలీసుల‌ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం కార్య‌క్ర‌మానికి సీఎం జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా సీఎం గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. అనంత‌రం పోలీస్ అమ‌ర‌వీరుల పుస్త‌కాన్ని విడుద‌ల చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో విలేక‌ర్ల‌తో సీఎం మాట్లాడారు. సీఎంను బూతులు తిట్ట‌డం క‌రెక్టేనా అని ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు బ్రెయిన్‌తో కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాష్ట్రంలో యువ‌త భ‌విష్య‌త్‌ను దెబ్బ‌తీయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అదేవిధంగా డ్ర‌గ్స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారు ప్ర‌తిప‌క్ష‌నాయ‌కులు. ఇది అనైతికం.. అధ‌ర్మం.. పోలీసుల‌కు వీక్లీ ఆఫ్ ప్ర‌క‌టించిన తొలి రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌ద‌శ్ అని వెల్ల‌డించారు సీఎం. తీవ్ర‌వాదాన్ని, అసాంఘిక శ‌క్తుల‌ను ఏమాత్రం ఉపేక్షించ‌వ‌ద్ద‌ని పోలీసుల‌కు గ‌తంలో చెప్పాను, ఇప్ప‌డు చెబుతున్నాన‌ని ప్ర‌క‌టించారు.  త్వ‌ర‌లో పోలీస్ శాఖ‌లో భారీ ఉద్యోగాలు భ‌ర్తి చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. అదేవిధంగా పోలీస్ అమ‌రుల కుటుంబాల‌కు సీఎం ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: