క‌రోనా త‌గ్గిన‌ట్లు క‌న‌ప‌డుతున్నప్ప‌టికీ కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. మ‌న‌దేశంలో స‌గ‌టున ప్ర‌తిరోజు 22వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో స‌గ‌టున వెయ్యి కేసులు న‌మోద‌వుతున్నాయి. అంతేకాకుండా ఉత్ప‌రివ‌ర్త‌నం చెందిన డెల్టా ర‌కం వ‌ల్ల అమెరికా, ఇట‌లీ, బ్రిట‌న్ త‌దిత‌ర దేశాల్లో కేసులు ఉధృత‌మ‌వుతున్నాయి. అన్నిర‌కాల స‌దుపాయాలున్న అమెరికా మాత్రం డెల్టా దెబ్బ‌కు అల్లాడుతోంది. ఇక్క‌డి ప్ర‌జ‌లు టీకాలు వేయించుకోవ‌డానికి విముఖత చూపించ‌డం కూడా ఒక కార‌ణ‌మ‌వుతోంది. భార‌త్‌లోఇప్ప‌టివ‌ర‌కు క‌రోనావ‌ల్ల నాలుగు ల‌క్ష‌ల మందికిపైగా ప్రాణాలు కోల్పోతే అమెరికాలో ఏడున్న‌ర ల‌క్ష‌ల మందికి పైగా ఈ మ‌హమ్మారికి బ‌ల‌య్యారు. ఈ డెల్టా ర‌కంవ‌ల్ల ఆరోగ్యంగా ఉన్న యువ‌త కూడా వెంటిలేట‌ర్ల‌పై ఉండాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుతోంద‌ని వైద్య‌నిపుణులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. శీతాకాలంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉన్న‌ప్పుడు జాగ్ర‌త్త‌లు పాటించి, ఆ త‌ర్వాత పాటించ‌క‌పోవ‌డంవ‌ల్లే ఇటువంటి ప‌రిస్థితి త‌లెత్తుతోంద‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: