నాలుగు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు శాంతించాయి. తెలుగు సినీ న‌టుల‌కు సంబంధించిన మా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎంతటి హోరాహోరీ యుద్ధం న‌డిచిందో అంద‌రం చూశాం. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌పై మంచు విష్ణు ప్యానెల్ విజ‌యం సాధించింది. విష్ణు అధ్య‌క్షుడ‌య్యారు. సీసీటీవీ పుటేజ్ కావాలంటూ ప్ర‌కాష్ రాజ్ హ‌డావిడి చేశారు. ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. మోహ‌న్‌బాబు మంచి వ్య‌క్తి అన్నారు. త‌ర్వాత నాలుగు రోజుల నుంచి అంతా ప్ర‌శాంతం. యుద్ధానికి ముందు ప్ర‌శాంత‌తా?  యుద్ధం ముగిసిన త‌ర్వాత ప్ర‌శాంత‌తా? అనేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారా?  పైచేయి కోసం, ఆధిప‌త్యం కోసం ఆరాట‌ప‌డుతున్నారా?  గెలిచిన‌వారిపై ఓడిన‌వారు త‌మ ఆధిక్య‌త‌ను చూపించాల‌నుకుంటున్నారా?  రాజీనామా చేసిన‌వారు త‌మ రాజీనామాల‌ను వెన‌క్కి తీసుకుంటారా?  లేదంటే ఆ స్థానంలో విష్ణు కొత్త స‌భ్యుల‌ను నియ‌మిస్తారా?  ప్ర‌కాష్ రాజ్ కోర్టుకు వెళ‌తారా? త‌దిత‌ర విష‌యాల‌పై తెలుగు ప్ర‌జ‌ల‌కు ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa