ఏపీలో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌టానికి ఏం చేయాలో చేసి చూపిస్తాన‌ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు అన్నారు. వైకాపా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల వ‌ల్ల విధ్వంసానికి గురైన మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న 36 గంట‌ల నిర‌స‌న దీక్ష ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ ప‌ట్టాభి మాట్లాడిన‌ది త‌ప్పా?  మంత్రులు మాట్లాడిన‌ది త‌ప్పా?  నిరూపించేందుకు చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌న్నారు. 70 ల‌క్ష‌ల మంది తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు నిర్మించుకున్న దేవాల‌య‌మ‌ని, అటువంటి చోటే దీక్ష చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌న్నారు. తెదేపాకు చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, కార్యాల‌యాలే ల‌క్ష్యంగా దాడులు జ‌రిగాయ‌ని, ప‌రిస్థితి గురించి మాట్లాడ‌టానికి డీజీపీకి ఫోన్‌చేస్తే ఫోన్ తీయ‌లేద‌ని, నా ఫోనే తీయ‌లేదంటే, స‌మాధానం చెప్ప‌లేదంటే రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్య ప‌రిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని, త‌మ‌నే కొట్టి త‌మ‌పైనే కేసులు పెడుతున్నార‌ని, ప్ర‌జాస్వామ్యంపైనే దాడి జ‌రిగింద‌ని, తెదేపాను అంత‌మొందించాల‌నే లక్ష్యంతోనే దాడులు జ‌రిగాయ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp