క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డానికి టీకా డోసుల‌ను పంపిణీ చేస్తున్న భార‌త్ అరుదైన మైలురాయిని అందుకుంది. 100 కోట్ల డోసుల‌ను పంపిణీ చేసి ప్ర‌పంచంలో చైనా త‌ర్వాత ఆ స్థాయిలో డోసుల‌ను పంపిణీ చేసిన దేశంలో నిల‌బ‌డింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 16వ తేదీన టీకా పంపిణీని ప్రారంభించిన భార‌త్ గురువారంతో 100 కోట్ల డోసుల ల‌క్ష్యాన్ని సాధించింది. మొద‌ట్లో టీకాల‌పై ఉన్న అపోహ‌ల‌వ‌ల్ల ఎవ‌రూ ముందుకు రాలేదు. రెండో ద‌శ విజృంభ‌ణ త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ టీకాల కోసం క్యూ క‌ట్ట‌డంతో ఒకానొక ద‌శ‌లో డిమాండ్‌కు, స‌ర‌ఫ‌రాకు అంత‌రం త‌లెత్తింది. ప్ర‌ధాన‌మంత్రి మోడీ జ‌న్మ‌దినం రోజు రెండున్న కోట్ల డోసులు పంపిణీ చేసిన భార‌త్ మ‌రో రికార్డు సృష్టించింది. ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి 45 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబ‌డిన‌వారంద‌రికీ టీకాలు పంపిణీ చేయ‌గా, మే ఒక‌టో తేదీ నుంచి 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబ‌డిన‌వారంద‌రికీ పంపిణీ చేశారు. తొలిద‌శ‌లో భాగంగా క‌రోనా పోరులో ముందున్న  వైద్యుల‌కు, వైద్య సిబ్బందికి, ఆరోగ్య కార్య‌కర్త‌ల‌కు వీటిని అంద‌జేశారు. వ‌చ్చే సంవ‌త్స‌రాంతానికి ప్ర‌తి పౌరుడికి, పౌరురాలికి టీకాలివ్వ‌డం పూర్తిచేయాల‌నే ల‌క్ష్యాన్ని భార‌త్ నిర్ధేశించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: