తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్  ఇంట‌ర్మీడియ‌ట్ ఎడ్యూకేష‌న్ ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్ టికెట్ల‌ను తాజాగా విడుద‌ల చేసింది. క‌రోనా కార‌ణంగా ప‌రీక్ష‌లు వాయిదా ప‌డిన విష‌యం విధిత‌మ‌మే. అక్టోబ‌ర్ 25 నుంచి న‌వంబ‌ర్ 02 వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ప‌రీక్ష‌లు రాసేందుకు విద్యార్థులు  tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించారు.

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు ఉద‌యం 9 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతాయి. ప‌రీక్ష కేంద్రాల‌కు చేరుకునేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా విద్యార్థులు హాల్‌టికెట్ తీసుకురావాల‌ని, లేని యెడ‌ల ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌ర‌ని ఇంట‌ర్ బోర్డు వెల్ల‌డించింది. క‌రోనా నిబంధ‌న‌లకు అనుగుణంగా క‌చ్చితంగా ప్ర‌తివిద్యార్థి మాస్క్ ధ‌రించి ప‌రీక్ష కేంద్రానికి చేరుకోవాల‌ని సూచించింది. శానిటైజ‌ర్‌, విద్యార్థ‌లు భౌతిక దూరం పాటించేవిధంగా ప‌రీక్ష కేంద్రాల్లో  ఏర్పాటు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోగానే వ్య‌క్తిగ‌త వివ‌రాలు ఏమైనా త‌ప్పులుఉన్నాయేమో స‌రిచూసుకోవాల‌ని సూచించింది. ఏమైనా త‌ప్పులుంటే బోర్డు దృష్టికి తీసుళ్లాల‌ని వెల్ల‌డించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: