యు.ఏ.ఈలో  పెట్టుబడులు పెడుతోంది ఎవరు ?
  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎమిరేట్స్ కు భారీ గా నిధులు సమకూరనున్నాయి. భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆ బ్యాంకులో పెట్టుబడులు పెట్టనున్నారు.  దాదాపు 46 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇందులో పెట్టబడి పెట్టేందుకు భారత్ కు చెందిన  ఓ  ప్రముఖ కంపెనీ ముందుకు వచ్చింది.  ఆ  బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకునే తొలి అవకాశం భారతీయులకే దక్కడం విశేషం.

గౌతమ్ ఆదానీ, ముఖేష్ అంబానీ, టాటా కంపెనీకి చెందిన చంద్రశేఖరన్.. వారి తరువాతి వంతు ఎవరు. మరెవరో కాదు భారత దేశానికి చెందిన మరో పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళ బిర్లా.  సామాజిక మాధ్యమాలలో ఎప్పుడూ మిగతా పారిశ్రామిక వేత్తలకన్నా ముందుండే ఆయన తాజా గా వార్తల్లోకి ఎక్కారు. మధ్య ఆసియా దేశాలలో తమ వ్యాపారాభివృద్ది కి బాటలు వేశారు.హమీద్ బిన్ జియాద్ అల్ నిహాన్ తో  కుమార మంగళ బిర్లా వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. ఈ విషయాన్ని వ్యాపార వర్గాలు ధృవీకరించాయి. ఇంతకీ ఎవరీ హమీద్ బిన్ జియాద్ అల్ నిహాన్  ? ఈయన అబుదాబీ ఇన్వెస్ట్ మెంట్ అధారిటీ కి (ఎడిఐఏ) డైరెక్టర్. జాంద్ -యు.ఏ.ఇ అక్కడి మొట్టమొదటి డిజిటల్  బ్యాంక్. వీరిద్దరి భాగస్వామ్యం మధ్య ఆసియా దేశాలలో మరో నూతన చరిత్రను సృష్టిస్తుందని వ్యాపార వర్గాలు పేర్కోంటున్నాయి. విడతల వారీగా బిర్లా అందులో పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం.
  ప్రపంచంలో కుబేరుల జాబితాను ఎప్పటి కప్పుడు ప్రచురించే ఫోర్బ్స్ పత్రిక తాజా   ఓ జాబీతా విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ లోని సంపన్నుల జాబితాలో కుమార్ మంగళ బిర్లాది పదో స్థానం.

మరింత సమాచారం తెలుసుకోండి:

uae