ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ త‌న‌దైన‌శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితులు చూస్తుంటే రాజ‌కీయ నాయ‌కులు బాక్సింగ్‌, క‌రాటే, క‌ర్ర యుద్ధంలాంటివి నేర్చుకోవాల‌న్నారు. దీనిపై ప‌లువురు నెటిజ‌న్లు త‌మ‌దైన రీతిలో స్పందిస్తున్నారు. క‌త్తిసాము, క‌ర్ర సాము శిక్ష‌ణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు. నేత‌లంతా ఎవ‌రికి వారు సొంతంగా శిక్ష‌ణ పొందాల‌ని, వాటికి కూడా కార్య‌క‌ర్త‌ల‌పై ఆధార‌ప‌డ‌కూడ‌ద‌ని, ఎప్పుడైనా ప్ర‌మాదం సంభ‌వించిన‌ప్పుడు క‌రాటే వ‌స్తే మ‌న‌మే పోరాడ‌వ‌చ్చ‌ని, కార్య‌క‌ర్త‌లు వ‌స్తారుక‌దా అని ఎదురుచూస్తే ఈలోగా ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చ‌న్నారు. ఇప్ప‌టికే ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం యుద్ధాన్ని త‌ల‌పిస్తోంద‌ని, ఈ యుద్ధం బాహుబ‌లి యుద్ధం క‌న్నా మిన్నగా ఉంటుందంటున్నారు. రామ్‌గోపాల్‌వ‌ర్మ చెప్పింది కూడా స‌రైన‌దేన‌ని, త్వ‌ర‌లోనే అంద‌రూ తుపాకీ లైసెన్స్ లు తీసుకొని ఒక‌ర్నొక‌రు కాల్చుకునే ప‌రిస్థితులు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవ‌ల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ఎవ‌రికి తోచిన‌ట్లుగా వారు పోస్టులు పెడుతున్నారు. ఎవ‌రికి న‌చ్చింది వారు లైక్ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: