టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాబిరామ్ గ‌త రెండు రోజుల నుంచి వార్త‌ల్లో క‌నిపిస్తున్న విష‌యం విధిత‌మే. నిన్న ప‌ట్టాబిని పోలీసులు అరెస్టు చేసిన  విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. తాజాగా గురువారం ప‌ట్టాబిని విజ‌య‌వాడ‌లోని తోట‌వ‌ల్లూరు పోలీస్ స్టేష‌న్ నుంచి విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప్ర‌తిలో క‌రోనా ప‌రీక్ష‌, ఆరోగ్యానికి సంబంధించిన ప‌లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప‌రీక్ష‌ల అనంత‌రం విజ‌య‌వాడ కోర్టుకు హాజ‌రుప‌రుచ‌నున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిని ప‌రుష‌ప‌ద‌జాలంతో దూషించార‌ని ప‌ట్టాబిని అరెస్ట్ చేసి 120 బీ, 353, 352, 153ఏ, 504, 505(2) వంటి ప‌లు సెక్ష‌న్‌ల కింద గ‌వ‌ర్న‌ర్‌పేట పోలీసులు తొలుత అరెస్ట్ చేశారు. ఆ త‌రువాత విజయ‌వాడ‌లోని తోట‌వ‌ల్లూరు పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అక్క‌డి నుంచి ఆస్ప‌త్రికి తీసుకొచ్చి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. జ‌న‌ర‌ల్ ఫిటినెస్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు సుమారు అర‌గంట నుంచి గంట స‌మ‌యం వ‌ర‌కు ప‌ట్టే అవ‌కాశం ఉంది. ప‌రీక్షలు నిర్వ‌హించిన త‌రువాత విజ‌య‌వాడ సివిల్ కోర్టుకు త‌ర‌లించ‌నున్నారు. న్యాయ‌మూర్తి రిమాండ్‌కు విధించే అవ‌కాశం ఉంది. మ‌చిలిప‌ట్నం లేదా విజ‌య‌వాడ‌లో రిమాండ్ విధించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప‌ట్టాబీని చూడ‌డం కోసం విజ‌య‌వాడ కోర్టు వ‌ద్ద‌కు టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టికే కొంత‌మంది చేరుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: