తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. నోటిఫికేష‌న్ ఎప్పుడు వ‌స్తుంద‌ని ప‌డిగాపులు కాసి ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్ర‌భుత్వం ఒక శుభ‌వార్త చెప్పింది. విద్యాశాఖ‌లో ఉన్న‌టువంటి ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఇందుకు కోసం తెలంగాణ ఆర్థిక‌శాఖ ఉత్త‌ర్వుల జారీ ప్ర‌క్రియ చేప‌ట్టింది. కాక‌పోతే ఈ పోస్టుల‌ను తాత్కాలిక ప్రాతిప‌దిక‌న చేప‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 2343 ఇన్‌స్ట‌క్ట‌ర్లు, క‌స్తుర్భాగాంధీ బాలిక‌ల విద్యాల‌యాల‌కు 937 పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెన్సియ‌ల్ టీచ‌ర్లు, 1435 ఉపాధ్యాయులు, పీఈటీ పోస్టుల‌ను భ‌ర్తీ చేప‌ట్ట‌నున్నారు. అదేవిధంగా ఆద‌ర్శ‌పాఠ‌శాల‌ల‌కు 397 ఒకేష‌న‌ల్ ట్రైన‌ర్లు, ఒకేష‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లు, ప్ర‌భుత్వ కాలేజీల‌కు 211 బోధ‌న సిబ్బంది పోస్టుల‌ను భ‌ర్తీ చేప‌ట్టునున్న‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. దీంతో కొంత మంది నిరుద్యోగులు మాత్ర‌మే హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మరికొంత నిరుద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం వ్యక్త‌ప‌రుస్తున్నారు.  ఒక నోటిఫికేష‌న్ వేసింద‌ని ఆశ‌ప‌డిన‌ కొద్ది సేప‌టికే  ఆశ‌ల‌న్ని అడిఆశ‌లుగా మారాయి. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న వేసే ఉద్యోగం ఎవ‌రికి కావాల‌ని కొంత‌మంది నిరుద్యోగులు నిరుత్సాహం చెందారు.


మరింత సమాచారం తెలుసుకోండి: