భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మరొక‌సారి జాతినుద్దేశించి ప్ర‌సంగం చేయ‌నున్నారు. ఈరోజు ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌ధాని జాతిని ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. మోడీ ఏ అంశం గురించి మాట్లాడుతార‌నేది ఎంతో ఆస‌క్తిక‌రంగా మారింది.
 
ఇటీవ‌ల క‌రోనా వ్యాక్సిన్ దేశంలో 100 కోట్లు దాటిన సంద‌ర్భంగా మోడీ ప్ర‌సంగం చేయ‌నున్నార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.  లేదంటే చైనాలో క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. దాని గురించా.. ? థ‌ర్డ్‌వేవ్ క‌రోనా గురించి జాగ్ర‌త్త‌లు ఇస్తాడా..? అమెరికాలో విజృంభిస్తున్న కొత్త‌వ్యాధి గురించి సందేశం ఇస్తాడా..? 5 రాష్ట్రాల్లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో వాటి గురించి ఏమైనా ఉంటుందనేది కొంద‌రూ ఊహ‌గానాలు చేస్తున్నారు. క‌రోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఒక ప్ర‌త్యేక  ప‌థ‌కాన్ని తీసుకొస్తున్నాడ‌ని స‌మాచారం. అదేవిధంగా బీసీ జ‌న‌గ‌ణ‌న సంబంధించి ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.
పిల్ల‌ల‌కు టీకాపై శుభ‌వార్త‌కు అవ‌కాశం ఉన్న‌ద‌ని కొంద‌రూ పేర్కొంటున్నారు.  ప్ర‌ధాని ఏమి చెప్ప‌బోతున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. భార‌త్ త‌క్కువ కాలంలోనే 9 నెల‌ల్లోనే 100 కోట్లు మైలురాయి దాటింద‌ని సంబ‌రాలు కూడ జ‌రుపుకున్నారు. ముఖ్యంగా దాని గురించి.. పిల్ల‌ల టీకాల గురించే ప్ర‌సంగం చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వీట‌న్నింటికి చెక్ పెట్ట‌డానికి ప్ర‌ధాని 10గంట‌ల‌కు ప్ర‌సంగంతో తేట‌తెల్లం కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: