గ‌త కొంత కాలం నుంచి సోష‌ల్ మీడియాలో స‌మంతా గురించి త‌రుచూ వార్త‌లు వినిపిస్తున్న విష‌యం విధిత‌మే. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించ‌గానే ప‌లువురు స‌మంత‌ను నిందించారు. కొంత‌మంది అస‌భ్య ప‌ద‌జాలం ఉప‌యోగించే వార్త‌ల‌ను రాయ‌డం,  యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేయ‌డంతో ప‌రువు న‌ష్టం జ‌రిగింద‌ని స‌మంత కోర్టులో పిటీష‌న్ వేసింది.

స‌మంత దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం దావా పిటిష‌న్‌పై ఇవాళ కూక‌ట్‌ప‌ల్లి కోర్టు తీర్పు ఇవ్వ‌నుంది. ఇప్ప‌టికే త‌మ వాద‌న‌లు వినిపించారు స‌మంత త‌రుపు న్యాయ‌వాది బాలాజీ. ముఖ్యంగా సుమ‌న్‌టీవీ, తెలుగు పాపుల‌ర్ టీవీ, సీఎల్ డాక్ట‌ర్ వెంక‌ట్‌రావు చేసిన ప్ర‌సారాల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని న్యాయ‌వాది కోర్టును కోరారు. అదేవిధంగా స‌మంత‌పై అస‌త్య ప్ర‌చారాలు చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరాడు. ఇవాళ స‌మంత పిటిష‌న్‌పై కూక‌ట్ ప‌ల్లి కోర్టు తీర్పు ఇవ్వ‌నుంది. కోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుంద‌ని ప‌లువురు స‌మంత అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తీర్పుకోసం కొద్ది గంట‌ల పాటు ఎదురుచూడ‌క త‌ప్ప‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: