నాగ‌చైత‌న్య‌-స‌మంత విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత స‌మంత‌పై సుమ‌న్ టీవీ, తెలుగు పాపుల‌ర్ టీవీ యూట్యూబ్ ఛానెళ్లు ప్ర‌సారం చేసిన క‌థ‌నాలు, డాక్ట‌ర్ సీఎల్ వెంక‌ట్రావు వ్యాఖ్యానంతో కూడిన వీడియోల‌పై క‌ల‌క‌లం రేకెత్తిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స‌మంత కూక‌ట్‌ప‌ల్లి కోర్టులో ప‌రువున‌ష్టం దాఖ‌లు చేశారు. స‌మంత సెల‌బ్రిటీ కావ‌డంతో కేసు విచార‌ణ‌ను స‌త్వ‌ర‌మే పూర్తిచేయాల‌ని ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది కోర‌డంతో కోర్టు ముందు అంద‌రూ స‌మానులేనంటూ న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. కేసు విచార‌ణ‌కు సంబంధించి శుక్ర‌వారానికి వాయిదా వేశారు. అస‌త్య ప్ర‌చారాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని, ప్ర‌సారం చేసిన వీడియోల‌ను తొల‌గించాలంటూ శాశ్వ‌త ఇంజ‌క్ష‌న్ ఆర్డ‌ర్లు ఇవ్వాలంటూ న్యాయ‌వాది కోరారు. ఆమెకు, ఆమె కుటుంబానికి ప‌రువు న‌ష్టం క‌ల‌గ‌కుండా చూడాల‌ని, బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ చెప్పేలా చూడాల‌ని విన్న‌వించారు. నాగ‌చైత‌న్య‌-స‌మంత తమ వైవాహిక జీవితానికి సంబంధించి ముగింపు ప‌లుకుతున్నామ‌ని ప్ర‌క‌టించ‌గానే ముఖ్యంగా స‌మంత‌పై డాక్ట‌ర్ సీఎల్ వెంక‌ట్రావు విశ్లేష‌ణ అభ్యంత‌ర‌క‌రంగా ఉందని, వాటిని ప్ర‌సారం చేసిన ఛానెళ్లు కూడా నైతికంగా వ్య‌వ‌హ‌రించ‌లేదంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: