అదానీ, అంబానీతోపాటు మ‌రికొన్ని కార్పొరేట్ సంస్థలు భారతదేశంలో భారీ ఆహార ధాన్యాల మార్కెట్‌పై దృష్టి పెట్టాయి. కానీ వాటికి కొన్ని సమస్యలు ఎదురవ‌డంతో న‌రేంద్ర‌మోడీ మోడీ ప్రభుత్వం చాకచక్యంగా వాటిని పరిష్కరించింది. రైతుల నుండి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి రాష్ట్రాలు వేర్వేరు నియమాలు & నిబంధనలను కలిగి ఉంటాయి. పన్నుల  విధానం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉండ‌టంతో దేశ వ్యాప్తంగా ఇన్ని రాష్ట్రాల్లో లాబియింగ్ నిర్వహించడం కార్పొరేట్లకు కష్టంగా మారింది. భారతదేశం ఫెడరల్ వ్యవస్థ అని అంద‌రికీ తెలుసు. వ్యవసాయం రాష్ట్రాల పరిధి లోనిది. కేంద్రం  వ్యవసాయ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన నాలుగు నల్ల చట్టాలతో వ్యవసాయ రంగాన్ని కేంద్రం తన నియంత్రణలోకి తీసుకుంది. పంట‌ను ఎక్కువ కాలం నిల్వ చేయ‌కుండా నిత్యావ‌స‌రాల చ‌ట్టాన్ని ర‌ద్దు చేసింది. ఈ చ‌ట్టం అమ‌ల్లో ఉంటే నిత్యావ‌స‌రాల‌ను ఎక్కువ కాలం నిల్వ చేయ‌డానికి అనుమ‌తి ఉండ‌దు. మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో కార్పొరేట్ కంపెనీలు ఎంతో సంతోషించాయి. ఎందుకంటే నిత్యావ‌స‌రాల‌ను వారు భారీగా స్టాక్ చేసుకొని కృత్రిమ కొర‌త సృష్టించి లాభ‌ప‌డే అవ‌కాశం ఉంటుందిగా అందుక‌ని.

మరింత సమాచారం తెలుసుకోండి: