ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఈరోజు జాతిని ఉద్దేశించి మాట్లాడ‌టంవ‌ల్ల ఏమ‌న్నా ఉప‌యోగం ఉందా? అంటే ఏమీ లేద‌నే చెప్ప‌వ‌చ్చు. దానికోసం ప్ర‌త్యేకంగా మాట్లాడాల్సిన అవ‌స‌రం కూడా లేదు. కాక‌పోతే 100 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశాం కాబ‌ట్టి, ప్ర‌చారం చేస్తే ఆర్భాటంగా ఉంటుందికాబ‌ట్టి ఆయ‌న మాట్లాడ‌తారు. ఇంత‌వ‌ర‌కు, ఇన్ని సంవ‌త్స‌రాల్లో ఏనాడూ మీడియా స‌మావేశం పెట్ట‌లేదు. విలేక‌రుల‌తో మాట్లాడ‌లేదు. ఏ ప్ర‌ధాన‌మంత్రైనా రెండోసారి కూడా అధికార చేప‌ట్టిన త‌ర్వాత విలేక‌రుల‌తో మాట్లాడ‌కుండా ఉంటారా? అది ఒక్క ప్ర‌జాస్వామ్య భార‌త‌దేశంలోనే సాధ్యం. ఆయ‌న మాట్లాడ‌రు. అంతే. ఆయ‌న కార్యాల‌యానికి కూత‌వేటు దూరంలో రైతులు కొన్ని నెల‌లుగా వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దుచేయాలంటూ నిర‌స‌న‌లు చేస్తున్నా వారి గురించి ఆలోచించ‌డంలేదు. కార్పొరేట్ కంపెనీల గురించే ఆలోచిస్తారు. వారికి న్యాయం చేయ‌డం ఎలా అనే ఆలోచిస్తారు. ఆ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఒక‌సారి జాతినుద్దేశించి మాట్లాడ‌వ‌చ్చుగా అంటున్నారు వ్య‌వ‌సాయ‌రంగ నిపుణులు. కానీ ఆయ‌న అందుకు అంగీక‌రించ‌డంలేద‌ని మోడీ కార్యాల‌య‌వ‌ర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: