భార‌త‌దేశం అక్టోబ‌ర్ 21 నాటికి క‌రోనా వాక్సిన్ 100 కోట్లు దాటిన సంద‌ర్భంగా మోడీ శుక్ర‌వారం జాతినుద్దేశించి మాట్లాడారు. ఇప్ప‌టివ‌ర‌కు 100 కోట్ల వ్యాక్సిన్‌లు ఇచ్చాం. వంద‌కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చి ఒక చ‌రిత్ర సృష్టించాం.  భార‌త విజ‌యాన్ని ప్ర‌పంచ‌దేశాల‌న్ని  కొనియాడుతున్నాయి.   మ‌న‌దేశం ఎంత సంక‌ల్ప‌బ‌ద్దంగా ఉందో ఇదే ఉదాహ‌ర‌ణ అని చెప్ప‌వ‌చ్చు. మ‌హ‌మ్మారిని విజ‌య‌వంతంగా, స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నాం.   ప్ర‌పంచ దేశాల‌న్ని మ‌న‌దేశం వైపు ఎదురుచూస్తున్నాయి.  

నిన్న మనం చరిత్ర సృష్టించాం. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఈ విజయం సాధ్యమైంది. దేశ ప్రజల సహకారంతోనే వందకోట్ల వ్యాక్సిన్ పూర్తి చేశాం. కరోనా వ్యాక్సిన్ వల్ల భారత్ అంటే ఏంటో చూపించాం. ఈ విజయం మన అందరిదీ. వ్యాక్సిన్ వార్ రూమ్ లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సంబరాలు జ‌రుపుకున్నారు. వందకోట్ల వ్యాక్సిన్స్ ఇచ్చిన భారత సత్తా చాటాం. ఈ వ్యాక్సిన్ తో  నవభారత్ కు నాంది పలికింది అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: