రైతులు ప్ర‌జ‌ల్లో భాగం కాద‌ని, వారిని వేరేగా ఏమ‌న్నా ప‌రిగ‌ణిస్తున్నారా అని రైతుసంఘాల ప్ర‌తినిధులు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని ప్ర‌శ్నిస్తున్నాయి. 100 కోట్ల టీకా డోసుల పంపిణీకి సంబంధించి జాతినుద్దేశించి మాట్లాడారు.. ప్ర‌జ‌లంద‌రికీ భ‌రోసా ఇస్తున్నామ‌న్నారు.. మ‌రి రైతులకు భ‌రోసా ఇవ్వ‌రా? అని ప్ర‌శ్నిస్తున్నారు. రైతులంటే ప్ర‌జ‌ల్లో భాగ‌మేక‌దా.. కానీ మీరు వారిని వేరుగా ఎందుకు చూస్తున్నార‌ని నిల‌దీస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దుచేయాల‌ని కోరుతూ చ‌లిలో, ఎండ‌లో, వాన‌లో ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో దీక్ష‌లు చేస్తున్న అన్న‌దాత‌ల గురించి ఎందుకు మాట్లాడ‌టంలేద‌ని అడుగుతున్నారు. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప‌రిగ‌ణించాల‌ని కోరుతూ ఉద్య‌మం చేస్తున్న రైతుల గురించి ఎందుకు ప‌ట్టించుకోర‌ని నిల‌దీస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల‌కు అనుకూలంగా తీసుకువ‌చ్చిన న‌ల్ల వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌వ‌ల్ల భ‌విష్య‌త్తులో రైతులు త‌మ సొంత భూముల్లో తామే రైతుకూలీలుగా మారే ప‌రిస్థితి త‌లెత్త‌బోతోంద‌ని రైతుసంఘాల ప్ర‌తినిధులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మౌనం వీడి మాట్లాడాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: