టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ మంత్రి ప‌రిటాల సునీత ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ఒక గంట క‌ళ్లు మూసుకోండి.. మేము ఏమిటో చూపిస్తాం అని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  మాలో సీమ ర‌క్తం ప్ర‌వ‌హిస్తున్న‌ద‌ని.. నా భ‌ర్త‌ను చంపినప్పుడు చంద్ర‌బాబు ఓర్పుగా ఉండ‌మ‌న్నారని వెల్ల‌డించింది.  ఇన్ని రోజులు ఓపిక ప‌ట్టాం. ఇక ఓపిక‌తో ఉండ‌లేని ప‌రిస్థితి దాపురించిందని పేర్కొన్నారు సునీత‌.

గ‌తంలో మేము అధికారంలో ఉన్న‌ప్పుడు పోలీస్ విభాగాన్ని వాడుకుంటే వైసీపీ గుండాలు ఇంకా మిగిలుండేవారు కాదన్నారు. ప‌రిటాల ర‌విని పొట్ట‌న పెట్టుకున్నా మేము అధికారంలోకి వ‌చ్చాక శాంతిగా ఉండ‌మ‌ని చంద్ర‌బాబు చెప్పార‌ని గుర్తు చేశారు. ప‌రిటాల‌ను చంపిన వారు రోడ్డు మీద తిరుగుతున్నా చంద్ర‌బాబు మీద ఉన్న గౌర‌వంతో ఎలాంటి గొడ‌వ‌లు పెట్టుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు.  ఇప్ప‌టికైనా టీడీపీ అధినేత చంద్ర‌బాబు మారాల‌ని సూచించారు. చంద్ర‌బాబు కాళ్ల కింద ఉండే వ్య‌క్తులు వంశీ, నాని ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మేము ఏమి చేస్తామో త్వ‌ర‌లో చేసి చూపిస్తాం అని వెల్ల‌డించారు సునీత‌.


మరింత సమాచారం తెలుసుకోండి: