కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ జనాగ్రహ దీక్ష లో మంత్రి క‌న్న‌బాబు మ‌రియు ఎమ్మెల్యే వంశీ పాల్గొన్నారు. ఈ సంధ‌ర్బంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ...దొడ్డి మార్గాన్ని నమ్ముకొని రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అంటూ విరుచుకుప‌డ్డారు. చంద్రబాబు దుర్మార్గం ఎలా ఉంటుందంటే ఆయనే గిల్లూతాడు ఆయనే ఏడుస్తాడు అంటూ ఆరోప‌ణ‌లు చేశారు. బోసిడికే అనే పదం తప్పు కాదని తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు...మహారాజశ్రీ అన్ని తీసేసి బోసిడికే అనే పదం రేపటినుండి రాసుకుని పంపించండి తెలుగుదేశం నాయకులు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

ఇప్పుడు జరుగుతున్న తోలుబొమ్మలాటకు స్క్రీన్ ప్లే-దర్శకత్వం అన్నీ చంద్రబాబు నాయుడే చేశారంటూ ఆరోపించారు. నాలుగు ఓట్లు సంపాదించడం కోసం కొంగ జపం డ్రామా ఆపండి అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నువ్వు కండకావరంతో మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావ్.....జగన్మోహన్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చే స్థాయి నీకొడుక్కి లేదు అంటూ క‌న్నబాబు లోకేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీరియస్ గా సినిమా జరుగుతుంటే సినిమా మధ్యలో వచ్చి కామెడీ చేసే కామెడీ ఆర్టిస్టు మీ కొడుకు అంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: