మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ముగిసి రెండువారాల‌వుతున్న‌ప్ప‌టికీ వేడి చ‌ల్లార‌డంలేదు. క‌ళాకారులంద‌రితోపాటు మా ఎన్నిక‌ల్లో పోటీచేసిన అభ్య‌ర్థులంద‌రికీ ద‌స‌రా సెల‌వులు ముగిసిన‌ట్లున్నాయి. తాజాగా ప్ర‌కాష్ రాజ్ ఆరోప‌ణ‌ల ప‌ర్వానికి తెర‌లేపారు. మా ఎన్నిక‌ల్లో ఏపీలో అధికారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకుంద‌న‌డానికి త‌న ద‌గ్గ‌ర ఆధారాలున్నాయంటూ ఆయ‌న కొన్ని చిత్రాల‌ను మీడియాకు విడుద‌ల చేశారు. తాజాగా ఆయ‌న ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్‌కు లేఖ రాశారు. వైకాపా కార్య‌క‌ర్త నూక‌ల సాంబ‌శివ‌రావు ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలో హాల్‌లోకి ఎలా ప్ర‌వేశించారో స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ప‌రిశీలించిన త‌ర్వాతే ప్ర‌కాష్ రాజ్ ఈ ఫొటోల‌ను కృష్ణ‌మోహ‌న్‌కు కూడా పంపించారు. ఇప్ప‌టికైనా పుటేజ్ ఇవ్వాలంటూ ప్ర‌కాష్ రాజ్ డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌కు చెందిన నూక‌ల సాంబ‌శివ‌రావుమీద క్రిమిన‌ల్ కేసులు కూడా ఉన్నాయ‌ని, వీటికి సంబంధించిన ఆధారాల‌తోపాటు ఎన్నిక‌లు జ‌రిగిన‌రోజు వీడియో పుటేజ్‌ల‌ను కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తాన‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa