మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల ప‌ర్వం మ‌రో మ‌లుపు తిరిగింది. అధ్య‌క్ష స్థానానికి మంచు విష్ణు చేతిలో ఓట‌మిపాలైన ప్ర‌కాష్‌రాజ్ తాజాగా కొన్ని చిత్రాల‌ను మీడియాకు విడుద‌ల చేశారు. ఎన్నిక‌లు ఎలా జ‌రిగాయో, పోలింగ్‌బూత్‌లో ఏం జ‌రిగిందో క‌నీసం బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌నివ్వండి కృష్ణ‌మోహ‌న్‌గారూ అంటూ కోరారు. నూక‌ల సాంబ‌శివ‌రావు అనే వైకాపా కార్య‌క‌ర్త‌ల ఎన్నిక‌ల హాల్‌లోకి వ‌చ్చి ఓటు వేయ‌డానికి వ‌చ్చిన ఓట‌ర్లంద‌రినీ విష్ణు ప్యానెల్‌కు ఓటేసేలా బెదిరించార‌ని ప్ర‌కాష్ రాజ్ ఆరోప‌ణ‌. ఆయ‌న న‌టుడుకాదు.. అస‌లు హాల్‌లోకి ఎలా రాగ‌లిగారు? అనేదే ప్ర‌కాష్ రాజ్ ప్ర‌శ్న‌. దానికి కృష్ణ‌మోహ‌న్ స‌మాధానం ఇవ్వ‌డంలేదు. ప్ర‌కాష్ రాజ్ విడుద‌ల చేసిన చిత్రాల‌ను ప‌రిశీలిస్తే సాంబ‌శివ‌రావు ఎన్నిక‌ల కేంద్రం లోప‌ల నిలుచున్న తీరు, అత‌ని హావ‌భావాలు ప‌రిశీలించిన‌వారికి ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మోహ‌న్‌బాబు ప్ర‌మేయం లేకుండా, కృష్ణ‌మోహ‌న్‌కు తెలియ‌కుండా అత‌ను లోపలికి రాలేరు అనేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇంత‌కీ మోహ‌న్‌బాబు అసెంబ్లీ రౌడీయా, లేదంటే మాకు రౌడీయా అని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa