మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల ప‌ర్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌న రాజ‌కీయ అవ‌సరాల‌కు ఉప‌యోగించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఏపీలో ప‌రిపాల‌నా ప‌రంగా ప‌లు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుండ‌టంతోపాటు ప్ర‌భుత్వాన్ని వెన్నాడుతున్న ఆర్థిక క‌ష్టాల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర్చేలా మా ఎన్నిక‌లు ఆ పార్టీకి బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే మోహ‌న్‌బాబు అవ‌డం, ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉండ‌టం, అది వైకాపా గెలుపును ప్ర‌భావితం చేసే అంశం కావ‌డంతో ఆచితూచి వైకాపా పాచిక విసిరింది. ప్ర‌కాష్ రాజ్‌కు చిరంజీవి వ‌ర్గం మ‌ద్ద‌తు ఉండ‌టంతో క‌మ్మ‌, కాపు వ‌ర్గాల మ‌ధ్య పోరుగా దీన్ని ప్ర‌చారం చేశారు. చివ‌ర‌కు కాపుల‌పై క‌మ్మ‌వారు పైచేయి సాధించేలా చూశారు. దీంతో స‌హ‌జంగానే క‌మ్మ‌, కాపు వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ధ్య కొంత ద్వేష‌భావం నెల‌కొంటుంద‌ని వైకాపా నేత‌లు అంచ‌నా వేశారు. అందుకు సాక్ష్యం అన్న‌ట్లుగా ఈరోజు ప్ర‌కాష్ రాజ్ విడుద‌ల చేసిన చిత్రాలు కూడా దీన్ని బ‌ల‌ప‌రుస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ దీనికి ఏం స‌మాధానం చెపుతుందో, మోహ‌న్‌బాబు ఏం స‌మాధానం చెబుతారో చూడాలి మ‌రి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

maa