ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రొక కీల‌క ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం కోసం ప‌లు ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విధిత‌మే. తాజాగా బ్రాహ్మ‌ణుల‌కు చేయూత‌నిచ్చేందుకు శ్రీ‌కారం చుట్టారు. బ్రాహ్మ‌ణుల‌లో పేద‌ల‌కు ఆర్థిక సాయం చేసేందుకు ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు  సీఎం జ‌గ‌న్. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న నిరుపేద బ్రాహ్మ‌ణుల అంత్య‌క్రియ‌ల‌కు ప్ర‌భుత్వం గ‌రుడ స‌హాయ ప‌థ‌కం కింద రూ.10వేలు ఆర్థ‌కసాయం కింద ఇవ్వ‌నుంద‌ని తాజాగా అధికారులు వెల్ల‌డించారు.

రూ.75వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న బ్రాహ్మ‌ణులు ఈ ప‌థ‌కానికి అర్హులుగా పేర్కొంటూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. మ‌ర‌ణించిన 40 రోజుల లోపు ఆయా కుటుంబాలు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని.. 40 రోజుల గ‌డువు దాటితే వ‌ర్తించ‌ద‌ని వెల్ల‌డించింది.  andhrabrahmin.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ ప‌థ‌కం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని పేర్కొంది.  ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో  ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ్రాహ్మ‌ణ సంక్షేమ కార్పొరేష‌న్ ఈ వ్య‌వ‌హారాల‌ను చూసుకోనున్న‌ది. ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం, మ‌ర‌ణించిన వారి డెత్ స‌ర్టిఫికెట్‌, వార్షిక ఆదాయం 75,000 కంటే త‌క్కువ ఉండాలి. మ‌ర‌ణించిన వారి గుర్తింపుకార్డు, కుటుంబ స‌భ్యుల గుర్తింపు కార్డులు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: