ఇటీవ‌ల జ‌రిగిన "మా" అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జ‌రిగిన ర‌చ్చ గురించి అందరికీ తెలిసిన విష‌య‌మే.   నూత‌నంగా "మా" అధ్య‌క్షునిగా ఎన్నికైన విష్ణు ఎన్నిక‌ల ప్రచారంలో ప‌లు హామీల‌ను చేశాడు. తాజాగా విష్ణు మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన హామీల‌ను నెర‌వేర్చేందుకు సిద్ధమ‌య్యాడు. ఈ నేప‌థ్యంలో త‌న తొలి నిర్ణ‌యాన్ని శుక్ర‌వారం ప్ర‌క‌టించాడు.
 
మ‌హిళ‌ల భద్ర‌త కోసం మా లో ఒక క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు  వెల్ల‌డించారు విష్ణు. ప్ర‌ముఖ సామాజిక కార్య‌క‌ర్త సునీత‌కృష్ణ‌న్ గౌల‌వ‌స‌ల‌హాదారుగా ఈ క‌మిటీకి ఉంటార‌ని విష్ణు ట్విట్ చేశాడు.  విమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ పేరుతో ఈ క‌మిటీని ఏర్పాటు చేశాం. దీని గురించి తెలియ‌జేస్తున్నందుకు చాలా గ‌ర్వంగా ఉంద‌ని తెలిపారు. మ‌హిళా సాధికార‌త కోసం క‌మిటీ ప‌ని చేస్తుంద‌ని వివ‌రించాడు. క‌మిటీకి స‌ల‌హాదారుగా ప‌నిచేయ‌నున్న ప‌ద్మ‌శ్రీ సునీతాకృష్ణ‌న్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇందులో మొత్తం న‌లుగురు మ‌హిళ‌లు, ఇద్ద‌రు పురుషులు స‌భ్యులుగా ఉంటారు. క‌మిటీకి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాం. మ‌హిళ‌ల‌ను ఎక్కువ‌గా "మా" లో భాగ‌స్వామ్యం చేయ‌డ‌మే మా ల‌క్ష్యం. ఇందుకు ఈ క‌మిటీ ద్వారానే తొలి అడుగు వేస్తున్నాం అని విష్ణు వెల్ల‌డించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: