డిజిట‌ల్ చెల్లింపుల సేవ‌ల సంస్థ అయిన ఫోన్ పే వినియోగ‌దారుల‌కు భారీ షాక్ ఇచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు యూపీఐ సేవ‌ల‌న్నింటిని ఉచితంగానే అందించింది. కానీ  ఈసంస్థ ఇప్ప‌టినుంచి ఛార్జీల‌ను వ‌సూలు చేయ‌నుంద‌ని ప్ర‌క‌టించింది. బ్యాంకుల చెల్లింపుల ద‌గ్గ‌రి నుంచి వివిధ నెల‌ల వారిగా చెల్లింపుల వ‌ర‌కు న‌గ‌దు లావాదేవీల నుంచి మోబిల్ రీచార్జ్ వ‌ర‌కు అన్నీ ఉచితంగా అందించిన సంస్థ ఇప్పుడు ఈ సేవ‌ల‌ను ఛార్జీల‌ను చేయ‌డం మొద‌లుపెట్టింది. దీనిని ప్ర‌యోగాత్మ‌కంగా మొబైల్ రీఛార్జీల‌పై తొలుత ప్రారంభించింది.

 యూపీఐ ద్వారా రూ.50 కంటే ఎక్కువ విలువైన మొబైల్ రీచార్జీల‌కు ఒక్కో లావాదేవీపై రూ.1 నుంచి 2 వ‌ర‌కు ప్రాసెసింగ్ ఫీజు రూపంలో వ‌సూలు చేయ‌డం మొద‌లుపెట్టిన మొట్ట‌మొద‌టి డిజిట‌ల్ చెల్లింపుల యాప్ ఫోన్ పేగా నిలిచింది. ఈర‌క‌మైన ఛార్జీల‌కు ఫోన్ పే స్పందిస్తూ ఇది ప్ర‌యోగాత్మ‌కంగా కొంత‌మంది నుంచి మాత్ర‌మే ఈ చార్జీల‌ను వ‌సూలు చేస్తున్నామ‌ని వివ‌రిస్తోంది. దేశ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్‌లో ఫోన్ పే సంస్థ రికార్డు స్థాయిలో రూ.165 కోట్ల ఆన్‌లైన్ లావాదేవీల‌ను జ‌రిపింది. యూపీఐ సేవ‌ల‌ను అందించే ఫోన్ పే ఏకంగా 40 శాతం వాటా కొన‌సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: