జీహెచ్ఎంసి పరిధిలో ఇప్పటికే అన్ని ఏరియాల్లో కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా నాణ్యమైన భోజనం ఏర్పాటు చేస్తామని గతం లో చెప్పింది . హాస్పిటల్ కి వచ్చే పేషేంట్ సహాయకులకు సహాయపడే విధంగా నాణ్యమైన భోజనాన్ని ఇచ్చేవిధంగా ఈ స్టాళ్లను నిర్మించనున్నారు. అయితే ఈ సేవలన్నీ కూడా ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో జరగనున్నాయి. ghmc పరిధిలోని దాదాపుగా 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభం కానున్నాయి. 



అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా శుక్రవారం నాడు మొదలు కావలసి ఉన్నది. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రానున్న రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభిస్తారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి ప్రోగ్రాం మొదలైతే కడుపునిండా అన్నం తినలేని పేదవానికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. అయితే ఈ ప్రోగ్రాం ని తరువాత రాష్ట్రవ్యాప్తం గా అన్ని ప్రభుత్వ సుపత్రుల్లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం క్రింద ఉదయం అల్పాహారం , మధ్యాహ్నం , రాత్రి పూట బోజనాలను ఒక్కో దాన్ని కేవలం రూ. 5  లకె అందించనున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: