క్ర‌మేపీ త‌గ్గిపోతోందనుకుంటున్న కొవిడ్ నెమ్మ‌దిగా పంజా విసురుతోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప‌లు దేశాలు చిగురుటాకులా వ‌ణుకుతున్నాయి. మొద‌టిద‌శ‌లో ఇట‌లీ ఎలా వ‌ణికిందో చూశాం. తాజాగా బ్రిట‌న్‌లో ప్ర‌తిరోజు 40వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతుండ‌గా, అమెరికాలో 90వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఒక్క శుక్ర‌వారంనాడే బ్రిట‌న్‌లో 50వేల కేసులు న‌మోద‌య్యాయంటే తీవ్ర‌త అర్థం చేసుకోవ‌చ్చు. ర‌ష్యా, ఉక్రెయిన్‌, రుమేనియా దేశాల్లో దీని తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతోపాటు చైనాలో కూడా మ‌రోసారి క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. ప్ర‌జ‌ల‌కు పూర్తిస్థాయిలో టీకాలు అంద‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని వైద్య‌నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చైనా త‌న దేశంలో ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసింది. అమెరికాలో ప్ర‌జ‌లు టీకాలు వేయించుకోవ‌డానికి ముందుకు రావాల‌ని అంటువ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఆంటోనీ ఫౌచీ కోరుతున్నారు. టీకా తీసుకోనివారి నుంచే ముప్పు ఎక్కువ‌గా ఉంటోంద‌న్నారు. శ‌నివారం నుంచి ర‌ష్యాలో లాక్‌డౌన్ అమ‌లు చేసే అవ‌కాశం ఉంది. ప‌రిస్థితి అంచ‌నా వేసి ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని అధ్య‌క్షుడు పుతిన్ అధికారుల‌ను ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: