డిజిట‌ల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే కొత్త‌గా త‌న వినియోగదారుల నుంచి యూజ‌ర్ ఛార్జీలు వ‌సూలు చేస్తోంది. ఫోన్ పే ద్వారా మొబైల్ రీఛార్జి చేసుకునేవారి నుంచి రూ.50 దాటితే ఒక రూపాయి, రూ.100 లావాదేవీ దాటితే రూ.2 వ‌సూలు చేస్తోంది. ప్ర‌యోగాత్మ‌కంగా ముందుగా మొబైల్ రీఛార్జిల‌పై ప్రాసెసింగ్ రుసుము వ‌సూలు చేస్తున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. ఇప్పుడు రీఛార్జితో మొద‌లుపెట్టి ఆ త‌ర్వాత బ్రాడ్‌బ్యాండ్ రీఛార్జి చేసుకునేవారి నుంచి, త‌ర్వాత విద్యుత్తు బిల్లులు చెల్లించేవారి నుంచి, ఆ త‌ర్వాత న‌గ‌దు బ‌దిలీ చేసేవారి నుంచి మోత మోగించ‌బోతోంది. ఎందుకంటే ఫోన్‌పే మ‌న‌దేశానికి చెందిన సంస్థ అని అంద‌రూ ప్రోత్స‌హిస్తూ వ‌చ్చారు. ఎప్పుడైతే వాల్‌మార్ట్ గ్రూప్ కింద‌కు వెళ్లిపోయిందో అప్ప‌టి నుంచే బాదుడు ప్రారంభించాల‌నే నిర్ణ‌యం జ‌రిగిపోయింది. 140 కోట్ల జ‌నాభా క‌లిగిన దేశంలో ఒక రూపాయి, రెండు రూపాయల‌తో ప్రారంభ‌మ‌య్యే ప్రాసెసింగ్ రుసుము ఆ త‌ర్వాత పెరిగే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. దీనికి యూజ‌ర్లు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. భ‌విష్య‌త్తులో ఇదే ఒర‌వ‌డిని సంస్థ కొన‌సాగిస్తే వినియోగ‌దారులు వేరే యాప్‌న‌కు మారే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: