పాన్ ఇండియా స్టార్‌,  బాహుబ‌లి, డార్లింగ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా శ‌నివారం ఆయ‌నకు ప‌లువురు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అందులో ముఖ్యంగా స్వీటీ అనుష్క‌శెట్టి స్పెష‌ల్‌గా విషెస్ చేశారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న రాధేశ్యామ్‌, ఆదిపురుష్ చిత్రాలకు సంబంధించిన యూనిట్ స‌భ్యులు, ఆయ‌న అభిమానులు, ప‌లువురు సిని ప్ర‌ముఖులు ప్ర‌భాస్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ త‌రుణంలోనే ప్ర‌భాస్ క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒక‌రైన అనుష్క‌శెట్టి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

లైఫ్‌లో వ‌చ్చే ప్ర‌తి అంశంలో ప్ర‌భాస్ బెస్ట్‌గా ఉండాల‌ని, తన స్టోరీల‌న్నీ స‌క్కెస్ కావాల‌ని, అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకోవాల‌ని కోరుకుంటున్న‌ట్టు అనుష్క ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. అదేవిధంగా కూ యాప్‌లో విషెస్ పోస్ట్ చేశారు అనుష్క‌. ఇప్ప‌టికే ప్ర‌భాస్ క‌లిసి బిల్లా, మిర్చి, బాహుబ‌లి ది బిగినింగ్‌, బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ వంటి చిత్రాల‌లో న‌టించిన విష‌యం విధిత‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: