ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భ‌వించింద‌ని, పార్టీ 20 సంవ‌త్స‌రా ల చ‌రిత్ర‌లో జాతీయ రాజ‌కీయాలను శాసించే స్థాయికి ఎదిగామ‌న్నారు. తెరాస ద్విద‌శాబ్ది ఉత్స‌వాల‌ను పురస్క‌రించుకొని హైటెక్స్ లో ఈనెల 25న ప్లీన‌రీ నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నూత‌న అధ్య‌క్షుణ్ని ఎన్నుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పాల‌న‌ను కొత్త మ‌లుపులు తిప్పామ‌ని, దేశ‌మంతా తెలంగాణ‌వైపు చూసేలా చేశామ‌న్నారు. ప్లీన‌రీకి ఆరువేల మంది ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నార‌ని, ప్ర‌తినిధులు త‌మ పేర్లు న‌మోదు చేసుకోవ‌డానికి 35 కౌంట‌ర్లు ఏర్పాటు చేశామ‌ని, స‌భా ప్రాంగ‌ణానికి ఇరువైపులా 50 ఎక‌రాల్లో పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పించిన‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. మాధ‌వ‌రం కృష్ణారావు ఆధ్వ‌ర్యంలో భోజ‌నాలు ఏర్పాటు చేశామ‌ని, ప్లీన‌రీలో ఏడు అంశాల‌పై తీర్మానాలుంటాయ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్లీన‌రీ సంద‌ర్భంగా దేశం మొత్తం మ‌రోసారి తెలంగాణ వైపు దృష్టిసారిస్తుంద‌ని, హైద‌రాబాద్‌ను ప్ర‌పంచ ప‌టంలో నెంబ‌ర్ వ‌న్‌గా తీర్చిదిద్దుతామ‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ktr