తెలంగాణ‌లో ప‌లు జిల్లాల‌లో భూ ప్ర‌కంప‌న‌లు క‌ల‌క‌లం రేపాయి. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో భూమి కంపించింది. చుట్టంబ‌ట్టివాడ‌, శ్రీ‌శ్రీ‌నగ‌ర్, సీతారాంప‌ల్లి, న‌స్పూర్, సీతా రాంపూర్,  అమ్మ గార్డెన్ త‌దిత‌ర‌ ప్రాంతాలలో 2 సెకండ్ల పాటు స్వల్పంగా  భూమి ప్ర‌కంప‌న‌లు సృష్టించింది.  ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా భూమి కంపించ‌డంతో ఏమి జ‌రిగిందో అర్థం కాక భ‌యంతో ప్ర‌జ‌లు  ఇండ్ల‌లోంచి బ‌య‌టికి ప‌రుగులు తీశారు.  

ఒకేసారి భూమి రెండు మూడు సెక‌న్ల‌పాటు  కంపించ‌డంతో ఎవ‌రికీ ఏమి అర్థం కాలేదు. జ‌నాలంద‌రూ ప‌రుగులు పెట్టారు. చాలా భ‌య‌ప‌డ్డాం. దిక్కుతోచ‌ని ప‌రిస్థితి ఎదురైంది. ఏమి చేయాలో అర్థం కాని ప‌రిస్థితి దాపురించింది అంటున్నారు అక్క‌డి ప్రాంత వాసులు. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో కంపించిన దాని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 4.0గా న‌మోదైనట్టు అధికారులు ధృవీక‌రించారు. తెలంగాణ‌లో భూకంపాల వ‌ల‌న ఆస్తి, ప్రాణ‌న‌ష్టం జ‌రగ‌క‌పోయినా వ‌రుస ప్ర‌కంప‌న‌ల వ‌ల్ల ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. గ‌తంలో సుమారు మూడు నాలుగు నెల‌ల కింద న‌ల్ల‌గొండ‌, నాగ‌ర్‌క‌ర్నూలు జిల్లాల‌లో కూడ భూమి కంపించ‌డంతో జ‌నాలు భ‌యాందోళ‌న‌కు చెందిన విధిత‌మే. తాజాగా క‌రీంన‌గ‌ర్‌, మంచిర్యాల జిల్లాలో ఈ ప‌రిస్థితి నెల‌కొన‌డంతో ప్ర‌జ‌లు  భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: