హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్‌ను భారీగా స్వాధీనం చేసుకుంది ఎన్‌సీబీ. హైద‌రాబాద్ నుంచి ఆస్టేలియాకు పార్సిల్ చేసింది. కోరియ‌ర్ ఆఫీస్‌లో ఎన్‌సీబీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. చెన్నైకి చెందిన ఓవ్య‌క్తిని కూడ అరెస్టు చేశారు. అత‌ని కోసం దాదాపుగా రెండు రోజుల పాటు గాలించారు. కొరియ‌ర్ ఆఫీస్‌లో మూడు కేజీల డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొరియ‌ర్ చేసిన వ్య‌క్తి న‌కిలీ ఐడీ కార్డును ఇచ్చిన‌ట్టు తేల్చారు. ఇప్ప‌టికే విశాఖ‌లో ఒక‌రు, హైద‌రాబాద్‌లో ముగ్గురు బీహారీలు అరెస్ట్ చేశారు.

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్‌ను భారీగా స్వాధీన ప‌రుచుకున్నారు. బెంగ‌ళూరు, హైద‌రాబాద్ కు సంబంధించిన ఎన్‌సీబీ అధికారుల జాయింట్ ఆప‌రేష‌న్ కొన‌సాగించారు. ఒక వ్య‌క్తి ఇచ్చిన స‌మాచారం మేర‌కు డ్ర‌గ్స్‌ను ప‌ట్టుకున్నారు. హైద‌రాబాద్ నుంచి ఏకంగా ఆస్ట్రేలియాకు త‌ర‌లించాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. వీరు స్వాధీనం చేసుకున్న డ్ర‌గ్స్ అంత‌ర్జాతీయ మార్కెట్‌లో కొన్ని కోట్ల రూపాయ‌ల విలువ చేస్తున్న‌ద‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్‌లో ఈ పార్స‌ల్ చేసిన వ్య‌క్తి ఎవ‌రు..? ఏమిటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్ప‌టికే అరెస్టు చేసిన వారి నుంచి వివ‌రాలు రాబ‌ట్టేందుకు పోలీసులు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  ఈడ్ర‌గ్స్‌కు సంబంధించి ఏదో ఒక ఫార్మ‌సీ కంపెనీకు సంబంధాలున్నాయ‌ని ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: