కొవిడ్‌కు సంబంధించిన వార్త‌ల‌ను ప‌దే ప‌దే తెలుసుకుంటుండ‌టంతోపాటు వాటిని త‌రుచుగా చ‌దువుతుండ‌టంవ‌ల్ల మాన‌సిక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయ‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు. 2019లో ఈ మ‌హ‌మ్మారి బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టినుంచి వాటికి సంబంధించిన వార్త‌లు తెలుసుకోవ‌డానికి అంద‌రూ సామాజిక మాధ్య‌మాల‌ను ఉప‌యోగించార‌ని, ఇది ఒక స‌మ‌స్య‌కాగా, నీలికాంతిపై ఆ వార్త‌ల‌ను ప‌దే ప‌దే చ‌ద‌వ‌డం కూడా ఈ త‌ర‌హా స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వ‌డానికి కార‌ణ‌మైంద‌ని విశ్లేషించారు. వీటిని ప‌దే ప‌దే చ‌ద‌వ‌డంవ‌ల్ల భావోద్వేగాల్లో అస‌మతుల్య‌త‌, మాన‌సిక ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ట్లు తేలింది. దీనికి సంబంధించి బ్రిట‌న్‌లో ఆరువేల‌మందిపై అధ్య‌య‌నం నిర్వ‌హించారు. సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే ప్ర‌తికూల వార్త‌ల‌పై ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌డంవ‌ల్ల ఇటువంటి ప‌రిస్థితి త‌లెత్తుతోంద‌ని, కొవిడ్‌కు సంబంధించిన సాధార‌ణ వార్త‌లు చ‌దివానవారికి ఎటువంటి ఇబ్బందిలేద‌ని చెప్పారు. ఎవ‌రైతే ఎక్కువ‌గా ప్ర‌తికూల వార్త‌ల‌ను ప‌దే ప‌దే చ‌ద‌వ‌డం, వాటిని షేర్ చేయ‌డం, వాటిగురించి చ‌ర్చించ‌డం, వాటిగురించి ఆలోచించ‌డం చేశారో వారిపై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని, అధ్య‌య‌నంలో కూడా ఇదేతేలింద‌ని నిపుణులు వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: