తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్ రావు నాన్ లోక‌లేన‌ని, వారు వారి నియోజ‌క‌వ‌ర్గాల‌కు అనామ‌కుల‌ని ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల‌, గ‌జ్వేల్‌, సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఈ ముగ్గురూ అనామ‌కుల‌న్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేస్తోన్న బ‌ల్మూరి వెంక‌ట్‌ను స్థానికేత‌రుడు అన‌డంపై రేవంత్ స్పందించారు. ఈ వ్యాఖ్య‌పై ఆయ‌న తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఉప ఎన్నిక‌ల్లో పోలీసుల‌ను నిజాయితీగా విధులు నిర్వ‌హించ‌నీయ‌కుండా ప్ర‌భుత్వం అడ్డుకుంటోంద‌ని, హుజూరాబాద్‌ను తెరాస‌, బీజేపీ వ్య‌స‌నాల‌కు అడ్డ‌గా మార్చాయ‌ని రేవంత్ ఆరోపించారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టి ఓట్లు పొందేందుకు హ‌రీష్‌రావు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. పంప‌కాల్లో వ‌చ్చిన తేడాతోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక జ‌రుగుతోంద‌ని, ద‌ళిత బంధు, పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణం కోసం ఈటెల రాజీనామా చేయ‌లేద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. బీఎస్పీలో చేరిన ప్ర‌వీణ్‌కుమార్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన అధికారుల‌ను ప్ర‌భుత్వం వేధిస్తోంద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr