గ‌త కొంత‌కాలం నుంచి తెలంగాణ‌లో మావోయిస్టులు క‌నుమ‌రుగ‌య్యార‌ని అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఈనేప‌థ్యంలోనే తెలంగాణ‌లో అక్క‌డ‌క్క‌డ సంచ‌రిస్తున్నారు. ముఖ్యంగా చ‌తీస్‌గ‌డ్ సరిహ‌ద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. చ‌తీస్‌గ‌డ్‌లో త‌రుచూ మావోయిస్టులు, పోలీసుల మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రుగుతుంటాయి. పోలీసుల మీద మావోయిస్టులు.. మావోయిస్టుల మీద పోలీసులు కాల్పులు జ‌రుపుకోవ‌డం అక్క‌డ స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ కేంద్ర బ‌ల‌గాల‌ను కూడ పంపారు. మావోయిస్టుల ఏరివేత‌కు కోసం.

ఇదిలా ఉండ‌గా తాజాగా తెలంగాణ‌- చ‌తీస్‌గ‌డ్ ప్రాంతంలో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న ములుగు-బీజాపూర్ అట‌వీప్రాంతంలో చోటు చేసుకుంది.  ఈ ఎదురు కాల్పుల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.  ఎస్‌ఎల్‌ఆర్‌, ఎకె47 రైఫిల్‌లు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్‌లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దు లో ఇంకా  ఎదురు కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: