తెలంగాణ రాష్ట్ర స‌మితి అధ్య‌క్షునిగా తెలంగాణ ముఖ్య‌మంత్రి  క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్టు ప్లీన‌రీలో టీఆర్ఎస్  పార్టీ  జనరల్  సెక్రటరీ కే కేశ‌వ‌రావు ప్ర‌క‌టించారు. సీఎం కేసీఆర్ ను 9 వ సారి టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రతినిధులు.  ఈ సంద‌ర్భంగా కేశ‌వ‌రావు ప్రారంభ స‌మావేశంలో మాట్లాడారు.

 20 వ‌సంతాల కాలంలో  టీఆర్ఎస్ పార్టీ చేసిన  ఉద్య‌మం, అధికారికంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి వెల్ల‌డించారు. ముఖ్యంగా తెలంగాణ‌లో క‌రెంట్ క‌ష్టాలు పోయిన‌వి, నీటి క‌ష్టాలు తీరిన‌వి. తెలంగాణ‌లో ప‌చ్చ‌ని ప‌ల్లెలు క‌ళ‌క‌ల‌లాడుతున్నాయి. తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం పెరిగింది. త‌ల‌స‌రి ఆదాయంలో టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ చేస్తుంది కొండంత.. చెప్పుకుంటున్న‌ది గోరంత అని పేర్కొన్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో మ‌రెన్నో విజ‌యాలు సాధించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. కేసీఆర్‌ను అధ్య‌క్షునిగా  ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: