అప్రకటిత నిషేధాజ్ఞలు ఎక్కడంటే ?

భారత్ లోని అతిపెద్ద రాష్ట్రం అది. కేంద్రంలో నూ, రాష్ట్రంలోను ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రాష్ట్రం నిత్యం ఏదో ఒక రూపంలో  నిత్యం వార్తల్లో ఉంటుంది.  పాలక, ప్రతిపక్ష సభ్యులు కావచ్చు, రైతుల ఆందోళన విషయం కావచ్చు, ఆరోగ్య విషయమూ కావచ్చు. అక్కడి ఓ మిలటరీ ఏరియాలో అప్రకటిత నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి.  సాధారణంగా ఎవరికీ  ఆ ప్రాంతంలో ప్రవేశం ఉండదు.  కానీ అలాంటి చోట కూడా  ప్రభుత్వం అప్రకటిత నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది.

 అదే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం. కాన్పూర్ పరిసర ప్రాంతాలలో  ప్రభుత్వం  నిషేధాజ్ఞలు అములు చేస్తోంది.ఇందుకు కారణం లేక పోలేదు.  కాన్పూర్ సమీపంలో పోఖ్రాపూర్ సమీపంలోని మిలటరీ ఏరియాలో ప్రభుత్వ అప్రకటిత నిషేధం అమలవుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగానికి చెందిన వారంట్ అధికారికి జికా వైరస్ సోకింది. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నేపాల్ సింగ్ ధృవీకరించారు.  జికా వైరస్ సోకిన అధికారిని ఐసోలేషన్ లో ఉంచారు. అతనితో సన్నిహితంగా ఉన్న పాతిక మందిని కూడా ఐసోలేషన్ కు తరలించారు. దాదాపు 200 మందికి పైగా జికా వైరస్ లక్షణాలు కనపడటంతో వారందరి రక్త నమూనాలు సేకరించి పూణెలోని ల్యాబ్ కు పరిక్షల నిమిత్తం పంపించారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన అధికారులు, జిల్లా కలెక్టర్ తో సమావేశమయ్యారు.  ఈ సమావేశం పూర్తయిన వెంటనే  కాన్పూర్ పరిసర ప్రాంతాలలో నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: