నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంకు చెందిన ఆయుర్వేధ నిపునుడు క‌రోనా కంటే ముందు ఎవ‌రికీ తెలియ‌దు. క‌రోనా స‌మ‌యంలో ఆనంద‌య్య ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయ్యాడు. క‌రోనా మందు త‌యారు చేసి ఎంతో మందికి పంపిణి చేశారు. కృష్ణపట్నం ఆనందయ్య  కరోనా మందుతో పాటు కంటి మందు త‌దిత‌ర మందుల‌ను పంపిణీ చేస్తున్న విష‌యం విధిత‌మే. ఇటీవ‌ల ఆనంద‌య్య హై కోర్టులో పిటిష‌న్ వేశారు. సోమ‌వారం ఆనంద‌య్య‌ పిటిష‌న్‌పై కోర్టులోవిచార‌ణ చేప‌ట్టింది. మొత్తం ఆరు పిటీష‌న్ల‌పై హైకోర్టు తీర్పును ఇచ్చింది. అదేవిధంగా అనుమ‌తి లేకుండా మందు ఎలా పంపిణీ చేస్తార‌ని హైకోర్టు వ్యాక్యానించింది.

కంటి మందుతో పాటు మొత్తం అన్ని ర‌కాల మందుల‌ను ఆపివేయాల‌ని కోర్టు సూచించింది. 1940 డ్ర‌గ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ సెక్ష‌న్ 33 ప్ర‌కారం త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన వారికి ట్రీట్‌మెంట్ చేయ‌వ‌చ్చ‌ని తీర్పు వెల్ల‌డించింది.  అయితే బ‌య‌టి ప్రాంతాల‌కు మాత్రం మందును తిరిగి పంపిణీ చేయ‌కూడ‌ద‌ని సూచించింది. కోర్టు తీర్పును అనుస‌రించాల‌ని పేర్కొంది. మొత్తం ఆరు పిటిష‌న్ల‌పై ఇవాల విచార‌ణ జ‌రిపి పీటిష‌న్‌ను కొట్టివేసింది హై కోర్టు.


మరింత సమాచారం తెలుసుకోండి: