హుజూరాబాద్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా ద‌ళిత బంధును నిలిపివేసిన విష‌యం విధిత‌మే. తాజాగా దీనిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ప్లీన‌రీలో మాట్లాడారు. ద‌లిత‌బంధుపై ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కేసులు వేశార‌ని.. అదేవిధంగా హుజూరాబాద్‌లో కేసీఆర్ స‌భ పెట్టొద్ద‌ని కేసు వేశారు. స‌భ ఎందుకు పెట్టొద్దు అని ప్ర‌శ్నించారు.  హ‌రీశ్‌రావు, కొప్పుల ఈశ్వ‌ర్‌, గంగుల క‌మ‌లాక‌ర్ వంటి నేత‌లు హుజూరాబాద్‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తు బీజీగా ఉన్నారని తెలిపారు. అందుకే ప్లీన‌రీకి హాజ‌రు కాలేదు.
 
 హుజూరాబాద్ ద‌ళిత బిడ్డ‌లు చాలా అదృష్ట‌వంతులు. ద‌ళిత బంధు ఫైల‌ట్ ప్రాజెక్ట్ అమ‌లు చేస్తాం. న‌వంబ‌ర్‌ 4 త‌రువాత  ద‌లిత‌బంధు ను ఎవ‌రు ఆప‌లేరు. అక్క‌డ  గెల్లు శ్రీ‌నివాస్‌ను గెలిపిస్తారు. గెల్లు శ్రీ‌నివాస్ ద‌ళితబంధు పూర్తి చేస్తాడు. న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్‌లో ద‌లిత‌బంధు అమ‌లు చేస్తాం. చేత‌కాని నేత‌లు ఏవేవో మాట్లాడుతారు.  ద‌ళిత బంధు ప‌థ‌కం ఉద్య‌మంలా కొన‌సాగుతుంద‌ని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: