తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం పేద‌ల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న‌దని.. రాష్ట్రంలో అనాథ‌లు రోడ్డున ప‌డుతున్నార‌ని వారిబాధ్య‌త‌ను ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌ని సీఎం కేసీఆర్ ప్లీన‌రీలో ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర మ‌హిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఆధ్వ‌ర్యంలో క్యాబినెట్ ప‌ని చేస్తుంది. ఇక నుంచి అనాథ‌ల‌కు త‌ల్లి, తండ్రి అన్నీ ప్ర‌భుత్వమే అని వెల్ల‌డించారు. స‌ర్పంచ్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ‌రైనా అనాథ‌లు ఉంటే వారిని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ దృష్టికి తీసుకెళ్లండి.

వారి బాధ్య‌త‌ను   రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే చూసుకుంటుంది. అందుకు సంబంధించిన అధికారులంద‌రూ స‌త్య‌వ‌తి రాథోడ్ ఆధ్వ‌ర్యంలో ప‌ని చేస్తుంద‌ని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో  టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన అభివృద్ధి గురించి స‌త్య‌వ‌తి రాథోడ్ వ‌ర్ణించారు.  ముఖ్యంగా గిరిజ‌నుల పోడు భూముల స‌మ‌స్య‌ను కేంద్ర ప్ర‌భుత్వం కూడ ప‌రిష్క‌రించలేదు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిష్క‌రించాడు. పోడు భూముల‌కు కూడ రైతుబంధు,  రైతుబీమా వంటి ప‌థ‌కాలు వ‌ర్తింప‌జేయాల‌ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: