అక్టోబ‌ర్‌ 20న  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు  వైఎస్‌ షర్మిల శ్రీకారం చుట్టిన పాద‌యాత్ర‌ను  ఆమె త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ ప్రారంభించిన విష‌యం విధిత‌మే. అప్ప‌టి నుంచి వ‌రుస‌గా ఆరు రోజుల పాటు చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర పూర్తి చేసుకొంది. ప్ర‌స్తుతం మ‌హేశ్వ‌రం నియోజ‌కవ‌ర్గంలోకి అడుగు పెట్టింది ష‌ర్మిల‌. చేవెళ్ల‌, శంషాబాద్ ల మాదిరిగానే మ‌హేశ్వ‌రంలో కూడ బ‌హిరంగ స‌భను నిర్వ‌హించారు.

రాష్ట్రవ్యాప్తంగా 90 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, 14 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో పాద‌యాత్ర కొన‌సాగించ‌నుంది. దాదాపు 4వేల కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేయ‌నుంది ష‌ర్మిల‌.  సోమ‌వారం వ‌ర‌కు ష‌ర్మిల వ‌రుస‌గా ఆరు రోజుల పాటు కొన‌సాగించింది ప్ర‌జాప్ర‌స్థాన‌ పాద‌యాత్ర‌.  ఏడ‌వ రోజైన మంగ‌ళ‌వారం తాత్కాలికంగా బ్రేక్ ప‌డ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మంగళవారం మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తిమ్మాపూర్ గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. దీంతో బ్రేక్ ప‌డ‌నుంది. ఈరోజు  రాత్రికి తిమ్మాపూర్‌లోనే షర్మిల బస చేయనున్నారు. నిరుద్యోగ దీక్ష కార‌ణంగానే ష‌ర్మిల మ‌హాప్ర‌స్థాన పాద‌యాత్ర మంగ‌ళ‌వారం బ్రేకు ప‌డనుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: