దేశంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో వినపడుతున్నది. ప్రాణాలు కోల్పోయిన వారికి కనీసం లక్ష రూపాయాలు అయినా ఇవ్వాలని డిమాండ్ లు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వెనకడుగు వేస్తున్నాయి. కాని ఏపీ ప్రభుత్వం మాత్రం ముందుకు వెళ్తుంది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే వెనక్కు తగ్గడం లేదు.

ఈ నేపధ్యంలో నేడు సిఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 వలన మరణించిన వారి కుటుంబానికి ₹50,000 లు మంజూరు చేసేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోవిడ్ 19 మూలంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం వర్తిస్తుంది అని ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. దరఖాస్తు నమునాను కూడా ఉత్తర్వులలో ఏపీ  ప్రభుత్వం పేర్కొన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: