దేశంలో కరోనా వైరస్ విషయంలో కాస్త ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో కొత్త వేరియంట్ లు ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్త వేరియంట్ ల విషయంలో చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ గానే ఉండి చర్యలకు దిగుతుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మన దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో ఒక సంచలన విషయం బయటకు వచ్చింది.

మధ్యప్రదేశ్‌లో ఏవై.4 అనే కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ఆరుగురికి సోకిన వైరస్‌ పై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. కొత్త వేరియంట్‌ సోకిన విషయాన్ని ధృవీకరించిన ఢిల్లీ లోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం... దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: