ఆర్యన్‌ఖాన్‌ కేసు విచారణలో భాగంగా ఎన్‌సీబీపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ మంగళవారం కూడా మ‌రోసారి వ్యాఖ్యానించారు. పేరులేని ఓ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి నుంచి తాను కవరు అందుకున్నాని, త్వరలో వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. ‘అందరికీ శుభోదయం, త్వరలో విడుదల చేస్తున్నాను...‘స్పెషల్ 26’ అని  మంత్రి తెలిపారు. ‘‘పేరు తెలియని ఎన్సీబీ అధికారి నుంచి నాకు వచ్చిన లేఖను త్వరలో విడుదల చేస్తాను.’’ అని మంత్రి న‌వాబ్‌మాలిక్ ప్ర‌క‌టించారు.   షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నిందితుడిగా గుర్తించిన డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో ఎన్‌సీబీ అధికారులు, బీజేపీ నాయకులు కుమ్మక్క‌య్యారని, తన అల్లుడు కూడా డ్రగ్స్ కేసులో 9 నెలల క్రితం అరెస్టైన‌ట్లు తెలిపారు. గత నెల 27వతేదీన అతనికి బెయిలు మంజూరైంద‌ని, తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంద‌న్నారు. సమీర్ వాంఖడే ఆర్యన్ ఖాన్ కేసులో విచారణకు నాయకత్వం వహిస్తున్న అధికారి కావ‌డంతో అత‌నితో ముడిపడి ఉన్న కేసులో ఒక సాక్షి ద్వారా అక్రమ వసూలు డిమాండ్లు బ‌య‌ట‌పడిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: